బార్డర్ ఎగ్జిట్ రూల్స్, ట్రాఫిక్ ఫైన్స్ పై కువైట్ క్లారిటీ..!!
- July 25, 2026
కువైట్ సిటీ: ట్రాఫిక్ జరిమానాలు (ఫైన్లు) చెల్లించని అన్ని వాహనాలను సరిహద్దు చెక్‌పోస్టుల ద్వారా దేశం వెలుపలికి వెళ్లనివ్వడం లేదంటూ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoI) స్పష్టం చేసింది. న్యాయపరమైన లేదా ముందస్తు జప్తు (ఇంపౌండ్)కు గురైన వాహనాలు, అలాగే ఇన్సూరెన్స్ గడువు ముగిసిన వాహనాలకే సరిహద్దు దాటేందుకు ఆంక్షలు ఉంటాయని తెలిపింది. కేవలం ట్రాఫిక్ ఫైన్లు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో వాహనాలపై ఎలాంటి నిషేధం విధించడం లేదని వెల్లడించింది.
అలాగే, కువైట్ పౌరులు దేశం విడిచి వెళ్లే ముందు ట్రాఫిక్ ఫైన్లు తప్పనిసరిగా చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అయితే ప్రవాసులు దేశం విడిచి వెళ్లే ముందు తమపై ఉన్న ట్రాఫిక్ ఫైన్లన్నింటినీ చెల్లించాల్సి ఉంటుందని, ఇది అమల్లో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారమేనని వివరించింది. సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని ధృవీకరించకుండా షేర్ చేయవద్దని, అధికారిక వర్గాల నుంచి విడుదలయ్యే సమాచారాన్నే నమ్మాలని ప్రజలకు మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- శ్రీవారి భక్తులకు అలర్ట్..ఆగస్టు 1 నుండి పుష్కరిణి మూసివేత!
- విద్యాసంస్థల్లో డ్రగ్స్ నిర్మూలనకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- గోవాలో జూలై 25–27 వరకు ‘యూత్ ఐకానిక్ ఎంటర్‌ప్రెన్యూర్స్ సమ్మిట్–2026’
- ఎన్ఆర్ఐ సర్టిఫికెట్ల కోసం అత్యవసర సేవలు.. దుబాయ్‌లోని భారత కాన్సులేట్ కీలక ప్రకటన..!!
- ఖతార్‌లో మరో మూడు సంవత్సరాల పాటు ONE ఛాంపియన్షిప్ పోటీలు..!!
- షైఖ్ ఇసా బిన్ సల్మాన్ బ్రిడ్జిపై రాకపోకలపై ఆంక్షలు..!!
- సముద్ర భద్రత, నౌకాయాన స్వేచ్ఛకు ఒమాన్ మద్దతు..!!
- సౌదీలో కొత్త జనరల్ ఎడ్యుకేషన్ చట్టానికి ఆమోదం..!!
- సౌదీలో సాటా నైట్ క్రికెట్ టోర్నమెంట్ ఘన విజయం..
- 45 రోజుల పాటు దుబాయ్ ఎయిర్పోర్ట్ ట్రాన్సిట్‌లో దాక్కున్న డ్రగ్స్ స్మగ్లర్ అరెస్ట్..!!







