స్వాతంత్రదినోత్సవంపై యూఏఈ భారతీయులేమంటున్నారంటే

- August 15, 2016 , by Maagulf
స్వాతంత్రదినోత్సవంపై యూఏఈ భారతీయులేమంటున్నారంటే

70వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న భారతావని గురించి యూఏఈలోని భారతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం ఎప్పుడూ ప్రత్యేకమైనదేనని చెబుతూ, దేశం ఎలా ఉండాలని తాము అనుకుంటున్నారో తెలియజేశారు. తమ ఆకాంక్షల్ని ప్రజలు తనకు తెలియజేస్తే ఆ విషయాల్ని స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఎర్రకోట సాక్షిగా తన ప్రసంగంగలో వాటిని ప్రస్తావిస్తాననిన నరేంద్రమోడీ ఇప్పటికే చెప్పారు. ఆ మాట ప్రకారం ఆయన ఎర్రకోటలో ప్రజల ఆకాంక్షల్ని ప్రస్తావించడం జరిగింది. యూఏఈలోని భారతీయులు తమ దేశం ఎలా ఉండాలి, తమ దేశంలో ఎలాంటి మార్పులు జరగాలని కోరుకుంటున్నారు వంటి విషయాల గురించి చూద్దాం. విశాల్‌ టిక్కు అనే వ్యక్తి మాట్లాడుతూ, అంతరిక్షంలో అనూహ్య విజయాల్ని అందుకుంటున్న భారతదేశం, ఇంకా టాయిలెట్స్‌ పరంగా సమస్య ఎదుర్కొంటోందనీ, ఈ విషయంలో ప్రభుత్వం చూపుతున్న చొరవ అభినందనీయమనీ, ఇంకా ఉధృతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆకాంక్షించారు. దేశంలో నిరుద్యోగానికి అవకాశం లేకుండా చేయాలని కోరుతూ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించగలిగినప్పుడే దేశం అభివృద్ధి పథంలోకి దూసుకెళుతుందని చెప్పారు. జిఎస్‌టి బిల్లు పాస్‌ అవడం పట్ల హర్సం వ్యక్తం చేశారు. యూఏఈ ఎక్స్‌ఛేంజ్‌ ఫౌండర్‌ ఛైర్మన్‌ బిఆర్‌శెట్టి మాట్లాడుతూ, దేశ ఆర్థిక వ్యవస్థ కొత్త పుంతలు తొక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దుబాయ్‌కి చెందిన కెఇఎఫ్‌ హోల్డింగ్స్‌ ఛైర్మన్‌ ఫైజల్‌ కొట్టికోలోన్‌ మాట్లాడుతూ, గడచిన ఏడాదితో దేశం ఎంతో అద్భుత ప్రగతి సాధించిందనీ, మేకిన్‌ ఇండియా స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాలు దేశ ప్రజలకు స్ఫూర్తినిచ్చాయని అన్నారు. ముందు ముందు మరిన్ని బలమైన నిర్ణయాలతో దేశాన్ని మోడీ ముందుకు నడిపించాలని ఆకాంక్షించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌పై ఇంకా ఎక్కువ ఫోకస్‌ పెట్టాల్సి ఉందని డాక్టర్‌ షంషేర్‌ వయాలిల్‌ చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com