బహ్రెయిన్ లో అక్రమ నర్సరీల మూసివేత

- July 28, 2015 , by Maagulf
బహ్రెయిన్ లో అక్రమ నర్సరీల మూసివేత


 విద్యాశాఖ అధికారులు జరిపిన సాధారణ తనిఖీలలో బహ్రెయిన్ లో లైసెన్స్ లేకుండా నడపబడుతున్న మనామా లోని అల్ ఆలెమ్ అల్ శాఘీర్ కిండర్ గార్టన్ , అల్ దూరాజ్ లోని అల్ సీఫ్ కిండర్ గార్టన్ ఇంకా మెక్ షా లోని అల్ మసాహెల్ కిండర్ గార్టన్ నర్సరీలను అధికారులు మూసివేశారు; యజమానులను బహిరంగ విచారణకు తరలించారు. గత సంవత్సరం ఏప్రిల్ లో బహ్రెయిన్ నర్సరీ విధానంపై ఆరోపణలు వచ్చిన కారణంగా MPలు జరిపిన విచారణలో, హిద్ద్ లోని ఒక నర్సరీలో పిల్లలను కుర్చీలకు కట్టడo, మంచినీరు కూడా తాగడానికి అనుమతించకపోవడం, ఇళ్లకు గాయాలతో రావడం వంటి భయంకర వేధింపుల చర్యలు వెలుగులోకి రావడంతో కమిటీ వారు నర్సరీల ప్రామాణికతను పెంచే  సత్వర చర్యలకు ఆదేశాలిచ్చిన సంగతి విదితమే.


--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com