బియ్యప్పిండి రొట్టెలు

- July 28, 2015 , by Maagulf
బియ్యప్పిండి రొట్టెలు

ఈ రోజు మరో పసందైన రొట్టెలతో మీ ముందుకు వచ్చాం... అవే బియ్యప్పిండి రొట్టెలు!!

 

కావలసిన పదార్ధాలు:

  • బియ్యప్పిండి                         - 4 కప్పులు
  • పల్లీల పొడి (వేయించిన పల్లీల తో ) - 1 కప్పు
  • పచ్చిమిర్చి పేస్టు                    - 1 టీ స్పూను
  • సన్నగా తరిగిన ఉల్లిపాయలు       - 1 కప్పు
  • కీరా దోసకాయ తురుము           - 1/2 కప్పు
  • కారత్ తురుము                     - 1/2 కప్పు
  • కొత్తిమీర తురుము                  - 2 టేబుల్ స్పూన్లు
  • మెంతికూర తురుము               - 2 టేబుల్ స్పూన్లు
  • పసుపు                               - చిటికెడు
  • ఉప్పు                                 - తగినంత

 

 

తయారు చేయు విధానం:

  • ముందుగా ఒక పెదా బౌల్ లో బియ్యప్పిండి, పల్లీల పొడి, ఉప్పు వేసి కలపండి.
  • ఇప్పుడు తురిమి పెట్టుకున్న కీరా దోసకాయ, కారట్, ఉల్లిపాయలు, కొత్తిమీర, మెంతి కూర, పచ్చిమిర్చి పేస్టు, ఉప్పు వేసి గోరువెచ్చని నీటిని పోస్తూ చపాతీ పిండి కంటే కాస్త మెత్తగా కలపండి.
  • ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి పెట్టుకోండి.
  • ఒక అలుమీనియం ఫాయిల్ మీద చేతికి కాస్త నూనె రాసుకొని ఈ ముద్దల్ని అద్దండి.
  • ఇప్పుడు ఒక పెనం మీద ఈ రొట్టె ను కాల్చండి. ఒక పక్క వేయించాక, ఆ ఫాయిల్ మెల్లిగా పైకి వచ్చేస్తుంది.
  • అప్పుడు మరో పక్క కూడా కాస్త నూనె వేసి కాల్చండి.
  • అంతే ఎంతో రుచికరమైన బియ్యప్పిండి రొట్టెలు తినటానికి రెడీ..!! వీటిని పెరుగుతో మరియు ఏదైనా పచ్చడితో తినచ్చు.

 

 

---- శ్రీమతి వేదా, దుబాయ్, యు.ఏ.ఈ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com