ఖతార్ లోని ప్రవాసకార్మికులకు భద్రతా అవగాహన కార్యక్రమాలు

- July 28, 2015 , by Maagulf
ఖతార్ లోని ప్రవాసకార్మికులకు భద్రతా అవగాహన కార్యక్రమాలు

ఆంతరంగిక వ్యవహారాల శాఖ వారి ప్రజసంబంధాల విభాగం వారు తమ భద్రత అవగాహనా కార్యక్రమంలో భాగంగా, జనరల్ డైరక్టరేట్ ఆఫ్ సివిల్ డెఫెన్స్ వారితో కలసి 3-రోజుల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. లార్సెన్ అండ్ టూబ్రో కంపెనీ యొక్క 200 మంది కార్మికులు పాల్గొనే ఈ కార్యక్రమంలో ఆంతరంగిక వ్యవహారాల శాఖ మరియు సివిల్ డెఫెన్స్ శాఖ అధికారులు ప్రసంగించనున్నారు. అంతేకాకుండా అగ్ని నిరోధకాలు, ఇతర భద్రతా పరికరాలను ఉపయోగించడంలో కూడా శిక్షణ ఈయబడుతుంది. రానున్న రోజుల్లో తమ సంస్థలో పనిచేస్తున్న మరో 3,000 మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సంస్థ HR మానేజర్ కౌశిక్ బెనర్జీ తెలిపారు.


--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com