అమెరికాలో సెటిలవ్వాలన్న వారికి ఇది శుభవార్త.......
- August 16, 2016
అగ్రరాజ్యం అమెరికాలో సెటిలవ్వాలన్న వారికి ఇది శుభవార్తే. నూతన వలసవాద సంస్కరణల బిల్లు హిల్లరీ మరోసారి తెరమీదకు తీసుకొచ్చారు. తాను అధికారంలోకి వస్తే ప్రతిపాదనల దశలోనే ఆగిపోయిన బిల్లుకు మోక్షం కల్పిస్తానంటున్నారు. అధ్యక్ష కేసులో పోటీపడుతున్న డెమాక్రాట్ అభ్యర్ధి తన ఇన్నోవేషన్ పాలసీని ప్రకటించారు.
అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ లో డిగ్రీ చేసి, ఉద్యోగావకాశం పొందితే చాలు... వారిక అమెరికా గ్రీన్ కార్డు పౌరసత్వానికి అర్హులవుతారు. అధ్యక్షురాలిగా ఎన్నిక అయితే తాను అనుసరించబోయే విధానాన్ని ఇటీవల హిల్లరీ వెల్లడించారు. ఇందులో ఉన్నత విద్య కోసం వచ్చే విద్యార్ధులకు శుభవార్త తెలిపారు. అమెరికాలోని గుర్తింపు పొందిన యూనివర్శిటీల్లో డిగ్రీ లేదా పిహెచ్డి చేసిన వారికి గ్రీన్ కార్డు ఇస్తామంటున్నారు. ఈ పాలసీ అమల్లోకి వస్తే ప్రస్తుతం లక్ష 32వేల 888 మంది భారతీయ విద్యార్తులకు ప్రయోజనం కలగనుంది. శాశ్వత పౌరసత్వం లభించే అవకాశం ఉంది. అయితే ఇది చైనాతో పోల్చితే తక్కువే. చైనాకు చెందిన సుమారు 3లక్షల 30వేల మంది విద్యార్ధులు అక్కడి విశ్వవిద్యాలయాల్లో చదువుతున్నారు. రెండోస్థానంలో భారత్ ఉంది. గతంలో అక్కడ ఈ నాలుగు కోర్సుల్లో విద్యను పూర్తి చేసిన వారికి బుష్ ప్రభుత్వం 2008లో ఆప్షనల్ ట్రైనింగ్ పిరియడ్ పేరుతో 29 నెలలు ఇక్కడే ఉండి ఉద్యోగం చేసే వెసులుబాటు ఇచ్చారు. 2015లో ఒబామా దీనిని 36 నెలలకు పెంచారు. ఉద్యోగి అక్కడే ఉండాలని అనుకుంటే అక్కడ కంపెనీలు హెచ్ 1బి కింద విసా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు హిల్లరీ క్లింటన్ అధ్యక్షురాలు అయితే యూనివర్శిటీ నుంచి బయటకు వస్తూనే ఏకంగా గ్రీన్ కార్డు ఇస్తామంటున్నారు. అయితే దీనిపై అమెరికాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయ విద్యార్ధులకు ఇది మేలు చేస్తుందని ఎన్నారైలు అంటున్నారు. దేశీయంగా నైపుణ్యం కలిగిన వారిని ఎంపిక చేసుకోవడానికి కంపెనీలకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని అంటున్నారు. అయితే అమెరికా నిపుణులకు అవకాశాలు తగ్గిపోతాయని అమెరికన్లు అంటున్నారు. మొత్తానికి హిల్లరీ మాత్రం విదేశీ విద్యార్ధులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. అయితే ఆమె గెలిస్తేనే?
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









