అపార్ట్మెంట్ యొక్క బాల్కనీ నుండి దూకి యువకుని ఆత్మహత్య

- August 16, 2016 , by Maagulf
అపార్ట్మెంట్  యొక్క బాల్కనీ నుండి దూకి  యువకుని  ఆత్మహత్య

షార్జ: ఒక ఎత్తైన అపార్ట్మెంట్  యొక్క బాల్కనీ నుండి  22 ఏళ్ల యువకుడు కిందకు దూకి చనిపోయాడు. ఈ దుర్ఘటన  మంగళవారం మధ్యాహ్నం షార్జా లోని జమాల్ అబ్దుల్ నాజర్ వీధిలో జరిగింది. ఒక షార్జా పోలీస్ అధికారి " మా గల్ఫ్ డాట్ కామ్ " తో  మాట్లాడుతూ , ఈ  లెబనీస్ వ్యక్తి  భూమిని తాకిన వెంటనే తక్షణమే మరణించాడని తెలిపారు.
పోలీసులు  మరియు అంబులెన్సులు తక్షణమే సంఘటన స్థలంకు చేరుకొన్నారు.  పోలీసు ఆపరేషన్ గదికి  సాయంత్రం 5 గంటల సమయంలో ఈ సంఘటన గురించి ఒక పిర్యాదు అందుకున్నామని ఆ  తర్వాత అక్కడకు పంపినట్లుఅధికారులు చెప్పారు.
లెబనీస్ యువకుని మృతదేహాన్ని అల్ కువైట్ హాస్పిటల్ తరలించారు. ఈ వ్యక్తి  ఆత్మహత్య చేసుకున్నట్లుగా పలువురు భావిస్తున్నారు.ఈ దుర్ఘటన వెనుక కారణాల గూర్చి  అల్ బుహారః  పోలీస్ విచారణ ప్రారంభించారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com