ఐస్ క్రీమ్ కోలీవుడ్ లో చాకోబార్ పేరుతో రిలీజ్ కు రెడీ...
- August 17, 2016
హిట్ ఫ్లాప్ అన్నతేడా లేకుండా కొద్ది రోజులు పాటు తెలుగు తెర మీద వరుసగా తన సినిమాలతో దాడి చేశాడు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. కొత్త టెక్నాలజీ పేరుతో కథ లేకపోయినా తన క్రియేటివిటీతో బండి లాగించెయ్యోచ్చన్న నమ్మకంతో వరుసగా సినిమాలు చేశాడు, అయితే ఈ లిస్ట్ లో చాలా వరకు డిజాస్టర్లుగా నిలిచాయి. దీంతో ప్రస్తుతం తన మకాం ముంబైకి మార్చేసిన వర్మ ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు.అయితే గతంలో వర్మ తెలుగుతో తీసిన ఓ ఫ్లాప్ సినిమాను ఇప్పుడు తమిళ్ లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారట. నవదీప్, తేజస్వీ జంటగా తెరకెక్కిన ఐస్ క్రీమ్ సినిమాను కోలీవుడ్ లో చాకోబార్ పేరుతో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా ఈసినిమా వర్మ పరిచయం చేసిన ఫ్లో కామ్, ఫ్లో సౌడ్ లాంటి టెక్నాలజీలు తమిళ ఆడియన్స్ ను కూడా ఆకట్టుకుంటాయన్న నమ్మకంతో ఉన్నారట. మరి తెలుగు ఐస్ క్రీమ్, తమిళ చాకోబార్ లా ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
తాజా వార్తలు
- జనవరి 2 నుంచి విజయవాడలో బుక్ ఫెస్టివల్
- అక్టోబర్ లో ఇంపోర్ట్స్ లో బహ్రెయిన్ రికార్డు..!!
- దాడిని ఖండించిన ఎనిమిది అరబ్, ఇస్లామిక్ దేశాలు..!!
- యూఏఈ అస్థిర వాతావరణం..భారీ వర్షాలు..!!
- భారత్ ఆర్కియాలజీ గ్యాలరీలో కువైట్ వస్తువులు..!!
- కస్టమ్స్ పోర్టులలో 1,145 అక్రమ వస్తువులు సీజ్..!!
- కీలక ఖనిజాల అన్వేషణ కోసం ఒమన్ రోడ్ మ్యాప్..!!
- రాచకొండ పోలీసులను అభినందించిన డిజిపి బి.శివధర్ రెడ్డి
- ఏపీ: లోక్ అదాలత్ 2 లక్షల కేసుల పరిష్కారం
- పెమ్మసానికి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు







