దీపాను ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపిక?
- August 17, 2016
2016 ఒలింపిక్స్‌లో తనదైన ప్రదర్శనతో భారతీయుల హృదయాలను గెలిచిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు అరుదైన పురస్కారం ఇవ్వాలని కేంద్రం భావిస్తోందట. ఈ నేపథ్యంలో 23 ఏళ్ల దీపాను ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపిక చేయాలని నిర్ణయించినట్టు సమాచారం.
ఒలింపిక్స్‌లో పతకం చేజారినా ఆమె చేసిన విన్యాసాలు కోట్లాది మంది భారతీయులను ఆకట్టుకున్నాయి. ఈ విషయంలో ఆమెకు అవార్డ్ ఇవ్వాల్సిందేనంటూ చాలామంది క్రీడాకారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డ్‌ని ఇవ్వనున్నారు. అదే విధంగా దీప కోచ్ బిశ్వేశ్వర్‌కు ద్రోణాచార్య ఇవ్వాలని నిర్ణయించినట్టు వార్తలు వెలువడుతున్నాయి. మరోపక్క రియోలో 10మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో ఎనిమిదో స్థానంలో నిలిచిన షూటర్ జితూరాయ్‌కు కూడా ఖేల్‌రత్న ఇవ్వనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు
- తెలంగాణ, ఏపీలో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు
- న్యూ ఇయర్ పార్టీలకు కఠిన నిబంధనలు విడుదల చేసిన పోలీస్







