పాముకాటు నుంచి రక్షించబడిన కొమొరోస్ జాతీయుడు
- August 17, 2016
రాస్ అల్ ఖైమాహ్ : కారులోంచి కాలు బైట పెట్టడంతోనే...సరిగ్గా అందుకోసమే కాచుకొని ఉన్నట్లుగా ఒక మీటరు పొడవైన ప్రమాదకర విషపాము ఆ వ్యక్తిని కాటువేసింది. దీనితో లబోదిబోమంటున్న బాధితుడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. స్థానిక రాస్ అల్ ఖైమాహ్ సోహిళ ప్రాంతంలో నివాసం ఉంటున్న 32 ఏళ్ల కొమొరోస్ జాతీయుడైన అస్లాం కైనాకు ఈ చేదు మంగళవారం రాత్రి అనుభవం ఎదురైంది. బాధితుడిని వెంటనే రాస్ అల్ ఖైమాహ్ లోని ఇబ్రహీం బిన్ హమద్ ఉబైదుల్లాహ్ ప్రభుత్వ ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలో చేర్పించారు. పాముకాటుతో అల్లాడిపోతున్న బాధితుడిని కుటుంబం సభ్యులు అదే కారులో వేగంగా చికిత్స కోసం ఆసుపత్రికి తరలించడంతో ఆ వ్యక్తి ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. అక్కడ వైద్యులు తక్షణ వైద్యం బాధితునికి అందడంతో ప్రమాదకరమైన పామువిషం అతని అంతం చేయలేకపోయింది.
తాజా వార్తలు
- మైనర్ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్







