ట్రయిల్ రన్ కి వెళ్లిన అతి పెద్ద విమానం
- August 18, 2016
ప్రపంచంలోనే అతి పెద్ద విమానం విజయవంతంగా తొలి టెస్ట్ ఫ్లైట్ పూర్తిచేసింది. అత్యంత పెద్దదైన 'ఎయిర్‌లాండర్-10' అనే ఈ విమానం ప్లేన్, ఎయిర్‌షిప్ కలిసి ఉంటుంది. గతంలో పలుమార్లు సాంకేతిక సమస్యల వల్ల విమానం టెస్ట్ ఫ్లైట్స్ విఫలమయ్యాయి. బుధవారం సెంట్రల్ ఇంగ్లాండ్‌లోని కార్డింగ్టన్ నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. విమానం టేకాఫ్ చూడడానికి వచ్చిన ప్రజలు చప్పట్లతో ఆనందం వ్యక్తంచేశారు.
85ఏళ్ల క్రితం ఎయిర్‌షిప్ ఆర్101 ఇదే ఎయిర్‌ఫీల్డ్ నుంచి టేకాఫ్ అయ్యి ఫ్రాన్స్‌లో కుప్పకూలి 48 మంది మరణించిన తర్వాత ఇన్నేళ్లకు మరో ఎయిర్‌షిప్ విజయవంతంగా టెస్ట్ ఫ్లైట్ పూర్తి చేసింది.
అరగంట పాటు విమానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ఈ విమానాన్ని అమెరికా ఆర్మీ కోసం నిఘా విమానంగా తయారు చేశారు. 92మీటర్ల పొడవుండే ఈ ఎయిర్‌లాండర్ 10 విమానాన్ని కమర్షియల్ సెక్టార్‌లోనూ వినియోగించవచ్చు. కార్గో విమానంగా వాడుకోవచ్చని అధికారులు తెలిపారు. ఈ విమానం ప్రాజెక్టుకు బ్రిటిష్ ప్రభుత్వం 3.7 మిలియన్ అమెరికా డాలర్లు ఇచ్చింది. ఇది 4,880 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది. గంటకు 148 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. హైబ్రిడ్ ఎయిర్ వెహికిల్స్(హెచ్ఏవీ) సంస్థ దీనిని తయారుచేసింది.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









