ఏపీకి కేంద్రం ఆర్థిక సహాయం!
- August 18, 2016
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఆర్థిక సహాయం అందజేసింది. రెవెన్యూ లోటు కింద రూ. 1,176 కోట్ల నిధులను కేంద్రం ఏపీకి విడుదల చేసిందని కేంద్రమంత్రి సుజనా చౌదరి గురువారం వెల్లడించారు. వెనుకబడిన జిల్లాలకు రూ. 350 కోట్లు, రాజధాని అభివృద్ధికి రూ. 450 కోట్లు విడుదల చేసినట్టు ఆయన తెలిపారు.
రాష్ట్ర విభజన అనంతరం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ సరైన ఆదాయం లేక ఆర్థిక లోటు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తగిన ఆర్థిక సాయం చేసి రాష్ట్రాన్ని ఆదుకోవాలని కేంద్రాన్ని ప్రభుత్వం కోరుతోంది. అయినా, కేంద్ర ప్రభుత్వం అరకొర సహాయం మాత్రమే చేస్తున్నట్టు విమర్శలు ఉన్నాయి.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్‌లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









