జీఎస్‌టీ అమలుతో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం
- August 19, 2016
అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) బిల్లును పార్లమెంట్‌లో ఆమోదింప చేయడంలో ప్రధాని నరేంద్రమోదీ సఫలమయ్యారని అమెరికా ఆర్థిక నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షాలను ఒప్పించి బిల్లుపై ఆమోద ముద్రవేయించడంలో మోదీ వ్యూహ చతురతను వారు కొనియాడారు. జీఎస్‌టీ అమలుతో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమల్లోకి రానుంది.'దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మోదీ ప్రభుత్వం మార్చలేదని ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి.కానీ ప్రధాని మోదీ కేవలం తన సభ్యులతోనే కాదు, ప్రతిపక్ష సభ్యులను సైతం ఒప్పించి జీఎస్‌టీ సాధ్యం చేయగలిగారు' అంటూ కార్నెగీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ జర్నల్‌లో మిలాన్ వైష్ణవ్ పేర్కొన్నారు.జీఎస్‌టీ విజయం మోదీ ప్రభుత్వానికి సరైన సమయంలో దక్కిందని పేర్కొన్నారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకున్న నేపథ్యంలో రాజకీయంగా ఈ అంశం భాజపా ప్రభుత్వానికి లాభించేదిగా అభివర్ణిస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







