పక్షిని 'ఢీ' కొట్టడంతో కతార్ ఎయిర్వేస్ విమానం అత్యవసర ల్యాండింగ్
- August 19, 2016
దోహా , ఇస్తాంబుల్ : తిమింగలం అంత సైజు ఉన్న పెద్ద విమానం ఓ బుల్లి పిట్ట దెబ్బకు అల్లాడిపోయింది . అర్ధాంతరంగా ఆకాశం నుంచి భూమి మీదకు గజ గజ వణుకుతూ దిగిపోయింది. వివరాలలోనికి వెళితే, కతర్ ఎయిర్వేస్ ప్రయాణీకుల విమానం దాని ఇంజిన్లలో , ఒక దానిలో అగ్ని రాజుకొని ఉందని ఏవియేషన్ అధికారులు మరియు క్యారియర్ తెలిపారు. దీనికి కారణం ఒక అనుమానిత పక్షి ప్రోఫిల్లెర్ ఇంజన్ లోనికి వెళ్లి ఆహుతై ఆపై మంటలు రగిల్చింది. దీనితో భయపడిపోయిన విమాన సిబ్బంది ఇస్తాంబుల్ లోని అతాతుర్క్ విమానాశ్రయం గురువారం అత్యవసరంగా విమానంని దించివేయాల్సివచ్చింది.
దోహా కు ప్రయాణిస్తున్న ప్రయాణికులందరు మరియు సిబ్బంది సురక్షితంగా ఉన్నారని కతార్ ఎయిర్వేస్ అధికారులు తెలిపారు. దోహా నుండి బుదపేస్ట్ వెళుతున్న క్యూ ఆర్ 240 విమానం 298 మంది ప్రయాణికులు మరియు 14 మంది సిబ్బందితో సహా ఇస్తాంబుల్ లోని అతాతుర్క్ విమానాశ్రాయంలో సురక్షితంగా ల్యాండ్ కాబడినట్లు నిర్ధారిస్తూ కతర్ ఎయిర్వేస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









