రజతం దక్కించుకున్న సింధు
- August 19, 2016
వరల్డ్ నెంబర్ వన్ కరొలినా మరీన్ రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ లో స్వర్ణం సాధించింది. తొలి సెట్ గెలుచుకున్న సింధుపై వరల్డ్ నెంబర్ వన్ క్రీడాకారిణి అద్భుతమైన పోరాటం చూపింది. సుమారు గంటర్నర పాటు సాగిన ఈ మ్యాచ్ లో కరొలినా మారిన్ సాధికారిక ఆటతీరుతో సింధును ఓడించింది. అనుభవజ్ఞురాలైన ప్రత్యర్థి మారినా ముందు సింధు దూకుడు నిలవలేకపోయింది. దీంతో ఈ భారత సంచలనం రజతంతో సరిపెట్టుకుంది. బాడ్మింటన్ చరిత్రలో ఒలింపిక్ రజత పతకం సాధించిన భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది. ఫైనల్లో ఓడినా 125కోట్ల మంది భారతీయుల హృదయాలను మాత్రం గెలుచుకుంది.
తొలి సెట్ లో అద్భుతంగా పుంజుకున్న రెండో సెట్, మూడో సెట్లలో అవకాశాలు కల్పించుకోవడంలో వెనుకబడిందని ఆమె తండ్రి రమణ అభిప్రాయపడ్డారు.
హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ప్రత్యర్థిని కోలుకోనివ్వకుండా ఆడడం ఎలా అన్నది నేర్చుకుంటుందని అన్నారు. మరీన్ అద్భుతంగా ఆడిందని, సింధుకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఆడిందని ఆయన ప్రశంసించారు. అయితే సింధు దేశ ప్రజలను నిరాశపర్చలేదని, దేశానికి బహుమతిగా రజతపతం తీసుకుని వస్తుందని అన్నారు. భారత బ్యాడ్మింటన్ చరిత్రలో ఇంత వరకు క్రీడాకారిణి సాధించని ఘనతను సాధించిందని ఆయన తెలిపారు.
పీవీ సింధు గురించి. ఒలింపిక్స్‌లో మహిళల బ్యాడ్మింటన్ ఫైనల్స్‌లో సింధు ఆడుతుండటంతో ఆమె గురించిన వివరాలు తెలుసుకోడానికి ఎక్కువగా ఆమె పేరు సెర్చ్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో ఇప్పటికే రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్‌ను వెతికారు. ప్రపంచ నెంబర్ 6 ర్యాంకర్ నొజొమి ఒకుహరాను ఓడించి ఫైనల్స్‌కు చేరుకున్న పీవీ సింధు భారతదేశంలో అతి ఎక్కువగా సెర్చ్ అయిన అథ్లెట్ సింధుయేనని గూగుల్ సంస్థ తెలిపింది.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







