ఆన్‌లైన్ ద్వారా తుపాకీ లెసైన్సు...
- August 21, 2016
ఆన్‌లైన్ ద్వారా తుపాకీ లెసైన్సు పొందడం, రెన్యువల్ చేసుకునే అవకాశాన్ని దేశంలోనే మొట్టమొదటిసారిగా పుదుచ్చేరిలో ప్రవేశపెట్టారు. దేశంలోని అన్నిరకాల ఆయుధాలను పర్యవేక్షించేందుకు వీలుగా ఆన్‌లైన్‌లో లెసైన్సులివ్వాలని కేంద్ర హోం శాఖ గతంలో ఆదేశించింది. దీనిపై చర్చించేందుకు పోలీసు, న్యాయ శాఖల అధికారులు, న్యాయమూర్తులు శనివారం పుదుచ్చేరి సచివాలయంలో సమావేశమయ్యారు.అక్కడే సచివాలయ కార్యదర్శి మనోజ్ పరిదా ఆన్‌లైన్‌లో లెసైన్సలిచ్చే పథకాన్ని ప్రారంభించారు. దీనివల్ల ఎక్కడైనా నేరాలు జరిగినచోట తుపాకీ దొరికితే, దానికి కేటాయించిన ప్రత్యేక సంఖ్య ద్వారా తుపాకీ ఎవ రిదో ఆన్‌లైన్‌లో సులువుగా తెలుసుకోవచ్చు.
కార్యక్రమంలో డీజీపీ సునీల్‌కుమార్ పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్







