ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఐఎస్‌లో..
- August 21, 2016
కేరళ నుంచి ఇటీవల అదృశ్యమైన పది మంది వ్యక్తులు కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్‌లో చేరినట్టు అనుమానాలు బలపడుతుండగా, వారిలో ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారనే సంచలన విషయం వెలుగుచూసింది. ఆ ఐదుగురు కూడా ముంబైకి చెందిన వ్యాపారవేత్త కుటుంబీకులుగా తెలుస్తోంది. ముంబై వ్యాపారవేత్త అబ్దుల్ మజీద్ కుమారుడు అష్ఫాక్ అహ్మద్ ఇటీవల తన భార్య, కుమార్తెను తీసుకుని పశ్చిమ ఆసియాకు వెళ్లిపోయాడు. మరో ఇద్దరు సోదరులు అష్ఫాక్‌తో కలిసినట్టు ఒక వార్తా కథనం బయటకు వచ్చింది. 26 ఏళ్ల అష్ఫాక్ తన భార్య, కుమార్తె, సోదరులు మహ్మద్ సిరాజ్, ఇజాజ్ రెహ్మాన్‌లతో కలిసి ఇస్లామిక్ స్టేట్‌లో చేరేందుకు జూన్‌లో ఇండియా విడిచి వెళ్లాడని తెలిసింది.అష్ఫాక్ సోదరులలో ఒకడైన మహ్మద్ సిరాజ్ వ్యాపారవేత్త కాగా, మరో సోదరుడు ఇజాజ్ మెడికల్ ప్రాక్టీషియనర్. అష్ఫాక్ తన చిన్న తమ్ముడికి జూన్‌లో మొబైల్ సందేశం పంపాడు. అందులో తాను ఐఎస్‌లో చేరానని, వెనక్కి రావాలనుకోవడం లేదని, తల్లిదండ్రులను కనిపెట్టుకుని ఉండమని తన సోదరుడికి అష్ఫాక్ సూచించాడు. కాగా, తన కుమారుడు ఐఎస్‌లో చేరడానికి ఒక మతబోధకుడితో సహా పలువురు కారణమని ఆరోపిస్తూ అష్ఫాక్ తండ్రి అబ్దుల్ మజాద్ ఈనెల 6న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీనిపై దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసులు మహ్మద్ హనీఫ్ అనే ఇస్లాం మంతబోధకుడికి అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







