ఉజ్జయినీ నగరం నిట మునిగింది...

- August 21, 2016 , by Maagulf
ఉజ్జయినీ నగరం నిట మునిగింది...

మధ్యప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఉజ్జయినీ నగరం నిట మునిగింది. దేవాలయాలు సయితం నీటిలో మునిగిపోయాయి. త్రిపుర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. రెండు రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురుస్తుండడంతో ఉజ్జయినీలోని సిప్రా నదిలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో నదీ తీరంలోని పలు ఆలయాలు నీట మునిగాయి. ఆలయ గోపురాలు కూడా కనిపించని పరిస్థితి, స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. నగరంలోని చాలా ఆలయాలు మూసివేశారు. మధ్యప్రదేశ్ అంతటా ఇదే పరిస్థితి. వరదలకు ఒక్కరోజే 15 మంది మృతి చెందారు. వరద ప్రాంతాల్లో సైన్యం సహాయక చర్యలు చేపడుతోంది. మరో 24 గంటలపాటు మధ్యప్రదేశ్ అంతటా వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది.గుణ, ఇండోర్‌, ఉజ్జయినీ, దేవా, ఛత్రపూర్‌లలో నిలు నిలిచిపోయింది. వరద బాధితులను ఆదుకుంటామని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్ హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com