ఎమిరేట్స్ ఐడి టైపింగ్ సర్వీస్: అక్కడ మాత్రమే
- August 21, 2016
ప్రస్తుతం 314 టైపింగ్ సెంటర్స్ యూఏఈలో ఎమిరేట్స్ ఐడీ కోసం ఇ-ఫామ్ టైపింగ్ సర్వీసుల్ని అందిస్తున్నాయి. కొత్త స్టాండర్డ్స్‌ని అందుకోగలిగిన టైపింగ్ సెంటర్స్ మాత్రమే, ఇ-ఫామ్ అప్లికేషన్‌ని యాక్సెప్ట్ చెయ్యడానికి అనుమతిస్తారు. కొత్త స్టాండర్డ్స్ కేవలం మంచి సర్వీసుని అప్లికెంట్లకు అందించడం కోసమే తీసుకొచ్చినట్లు అథికారిక వర్గాలు చెబుతున్నాయి. ఎమిరేట్స్ ఐడీ అథారిటీ సర్వీస్ సెంటర్స్ సపోర్ట్ డైరెక్టర్ నాజర్ అల్ అబ్దైలి మాట్లాడుతూ, అథారిటీ ఆమోదించిన ప్రాథమిక సూత్రాల్ని పరిగణలోకి తీసుకోకుండా పనిచేస్తున్న టైపింగ్ సర్వీస్ కేంద్రాల కారణంగా 99 శాతం తప్పిదాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ కారణంగా ఐడీ కార్డుల జారీ ఆలస్యమవుతుందని ఆయన వివరించారు. ప్రస్తుతానికి పనిచేస్తున్న 314 టైపింగ్ సెంటర్స్‌తో పాటు ముందు ముందు మరికొన్ని సెంటర్స్‌ని కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎమిరేట్స్ ఐడీ కోసం తామున్న ప్రాంతానికి పది కిలోమీటర్ల దూరంలోపలే టైపింగ్ సెంటర్ ఉండేలా అందరికీ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!
- షార్లెట్‌లో NATS ఆధ్వరంలో మహిళా దినోత్సవ వేడుకలు









