విమానంలో మరణించిన భారతీయని భౌతికకాయం నేడు స్వదేశానికి
- August 21, 2016
దోహా: కతర్ ఎయిర్వేస్ విమానంలో ప్రయాణిస్తూ ఆకాశం మధ్యలో అకస్మాత్ముగా మరణించిన భారతీయ వ్యక్తి యొక్క పార్ధీవదేహం సోమవారం సాయంత్రం ఆయన స్వదేశం లోని హైదరాబాద్ కు చేర్చబడుతుందని ఈ కార్యక్రమానికి పూనుకొన్న సామాజికవర్గాలు పేర్కొన్నాయి. ఆగష్టు 15 వ తేదీన తుమ్మల ప్రేమ్ ప్రసాద్ తన భార్యతో వాషింగ్టన్ డి.సి. నుండి వయ దోహా మీదుగా విమానంలో ప్రయాణిస్తూ తీవ్రమైన గుండె పోటుకు గురై మరణించారు. తుమ్మల ప్రేమ్ ప్రసాద్ తన భార్య అరుణతో కలిసి వారి పిల్లల వద్ద ఆరునెలల పాటు సెలవలు గడిపిన తర్వాత ఆగస్టు 14 వ తేదీ కతార్ ఎయిర్వేస్ విమాన క్యూఆర్ 708 విమానంలో వాషింగ్టన్ డల్లాస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్ లోని తమ ఇంటికి తిరుగు ప్రయాణమయ్యేందుకు విమానమెక్కారు. తుమ్మల ప్రేమ్ ప్రసాద్ సజీవంగా కన్న బిడ్డల వద్దకు సంతోషంతో వెళ్లిన ప్రేమ్ ప్రసాద్ ఆరునెలల తర్వాత నిర్జీవంగా తన స్వగృహానికి చేరుకోవడంతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి.
తాజా వార్తలు
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!







