సింధుకు హైదరాబాద్‌లో అడుగడుగునా నీరాజనాలు...

- August 22, 2016 , by Maagulf
సింధుకు హైదరాబాద్‌లో అడుగడుగునా నీరాజనాలు...

ఒలింపిక్స్‌లో రజతం సాధించిన తెలుగుతేజం పీవీ సింధుకు హైదరాబాద్‌లో అడుగడుగునా నీరాజనాలు. అసమాన ప్రతిభతో పతకం తెచ్చిపెట్టిన ఫస్ట్ భారతీయ యువతిగా చరిత్ర సృష్టించింది ఆమె. సొంతరాష్ర్టం ఆమెకు ఘనంగా స్వాగతం పలికింది. సింధు, కోచ్ గోపీచంద్‌లను తెలంగాణ మంత్రి కేటీఆర్‌తోపాటు ఏపీ మంత్రులు, అధికారులు, ఫ్యామిలీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పుష్పగుచ్చాలిచ్చి సింధును సాదరంగా ఆహ్వానించారు. అక్కడనుంచి ఓపెన్ టాప్ వాహనంపై విజయోత్సవ ర్యాలీ సాగింది.శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రాజేంద్రనగర్‌, అత్తాపూర్‌, మెహిదీపట్నం, టోలిచౌకి మీదుగా గచ్చిబౌలి స్టేడియం వరకు ఈ ర్యాలీని సాగింది. అనంతరం అక్కడి స్టేడియం అంతా తిరిగారు.అక్కడ ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, మంత్రి కేటీఆర్‌.. సిందు, కోచ్ గోపిచంద్‌లను సన్మానించనున్నారు. మరోవైపు పతకం సాధించిన తర్వాత సింధు తొలిసారి నగరానికి రానున్న నేపథ్యంలో రోడ్డుకు ఇరువైపులా పెద్ద సంఖ్యలో హోర్డింగ్‌లు వెలిశాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com