విమానాశ్రయంలో మంత్రులు, అధికారులు సింధుకు స్వాగతం పలికారు..

- August 22, 2016 , by Maagulf
విమానాశ్రయంలో మంత్రులు, అధికారులు సింధుకు స్వాగతం పలికారు..

రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజతపతకం తెచ్చిపెట్టిన షట్లర్‌ పి.వి.సిధు, కోచ్‌ గోపీచంద్‌ సోమవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో మంత్రులు, అధికారులు సింధుకు స్వాగతం పలికారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులు కేటీఆర్‌, మహేందర్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, ఏపీ మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, దేవినేని ఉమామహేశ్వరరావు, విజయవాడ ఎంపీ కేశినేని నాని తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు వూరేగింపు కొనసాగుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com