విటమిన్లతో సంపూర్ణ ఆరోగ్యం

- July 29, 2015 , by Maagulf
విటమిన్లతో సంపూర్ణ ఆరోగ్యం

శరీరానికి విటమిన్లుతో కూడిన ఆహారం చాలా అవసరం. రోగనిరోధక శక్తి పెరగడానికి, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడానికి విటమిన్లు చాలా ఉపయోగపడతాయి. ముఖ్యంగా 'విటమిన్‌ ఇ' ఎర్రరక్తకణాలు వృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. ఈ విటమిన్‌ పుట్టగొడుగులుచ మొక్కజొన్నలు, డ్రైఫ్రూట్స్‌, చేపలు వంటి వాటిలో ఎక్కువగా లభిస్తుంది. పుట్టగొడుగుల్లో విటమిన్‌ బి 5 ఎక్కువగా ఉంటుంది. వీటిని తరచూ ఆహారంలో తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు వృద్ది చెందడమే కాకుండా, రక్తహీనతతో బాధపడేవారికి ఎంత ఎక్కువగా తింటే అంత మంచిది. ప్రతిరోజూ ఉడికించిన మొక్కజొన్నలు తీసుకోవడం వల్ల విటమిన్స్‌ అంది శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. ఇక డ్రైఫ్రూట్స్‌, నట్స్‌ తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్లు అంది, శరీరంలో జీవ, రసాయనిక ప్రక్రియలు బాగా జరుగుతాయి. ఇక మాంసాహారం తీసుకొనేవాళ్లు గుడ్లు, చేపలూ ఎక్కువగా తీసుకోవాలి. శాఖాహారులైతే పాలూ, పెరుగూ వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల విటమిన్‌ బి5 శరీరానికి పుష్కలంగా అంది, శరీరం ధృఢంగా ఉండి ఆరోగ్యంగా ఉండడానికి తోడ్పడుతుంది.


 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com