20 రోజుల్లో రెండు లాటరీలు.... కేరళావాసికి వద్దంటే వస్తున్న కోట్లు
- August 24, 2016
దుబాయ్ : శని పట్టుకొంటె ఎలా వదలదో ....అదృష్ట లక్ష్మి అంటుకొంటే అలాగే వదలదేమోననిపిస్తుంది మన ప్రవాస భారతీయుని చూస్తుంటే ....దుబాయ్‌లో పనిచేసే కేరళకు చెందిన మొహమ్మద్ బషీర్ అబ్దుల్ ఖాదీర్‌కు త్రిబుల్ ధమాకా అదృష్టం పట్టింది. 62 ఏండ్ల ఈ అదృష్టవంతుడి జీవితంలో కేవలం 20 రోజుల్లోనే మూడు అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఒకటి ఒళ్లు గగుర్పొడిచేది కాగా.. మరొ రెండు ఆనందంలో తేలియాడేది. ఈ నెల 3 వ తేదీన దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమిరేట్స్ విమానం క్రాష్ ల్యాండ్ కావడం, మంటలు అంటుకున్న విమానంనుంచే ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్లనుంచి దూకి ప్రాణాలు దక్కించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆ ప్రమాదం జరిగిన విమానంలో మొహమ్మద్ బషీర్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక రెండోది సంతోషకరమైన ఘటన ఏమిటంటే.. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో నిర్వహించిన మిలీనియం మిలీనియర్ లక్కీ డ్రాలో మన కేరళావాసికి బంపర్ ప్రైజ్ వచ్చింది. బహుమతికింద ఏకంగా మిలియన్ డాలర్లు (రూ.67కోట్లు) కొట్టేశాడు. ఈ సంగతి తెలిసిన బషీర్ ఆనందంతో ఉబ్బితబ్బవుతున్నాడు. తాను ఇంకా ప్రమాదంనుంచి బయటపడిన ఘటననుంచే తేరుకోలేదని.. అలాంటిది వారం తిరగకముందే లాటరీ రూపంలో అదృష్టం తలుపు తట్టడం దైవనిర్ణయమేనని సంతోషపడుతున్నాడు. కేరళలో పేద కుటుంబాల చిన్నారులకు వైద్యం కోసం అవసరమైన సహాయం చేస్తానని పేర్కొన్నాడు. మరి ఆయన మాట దేవునికి నచ్చిందేమో ....ముచ్చటగా మూడో సారి అదృష్టం ఆయనని పలకరించింది. నిన్న ( మంగళవారం ), ఆయనని ఒక లాటరీ తాజా డ్రా పాటు జరిగిన ఒక అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి మొహమ్మద్ బషీర్ అబ్దుల్ ఖాదీర్ ఆహ్వానించారు.
డిడిఎఫ్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ మరియు సి ఈ ఓ కొం మెక్ లోఫ్లిన్ , ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సలహా తలాక్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిక్ బృవెర్, మరియు ఓ ఎల్ సీబీఐ , వైస్ ప్రెసిడెంట్ పాటు పలువురు మార్కెటింగ్ అధికారులు హాజరయ్యారు. వీరి సమక్షంలో ఒక మిలియన్ అమెరికా డాలర్ల లాటరీ టికెట్ ని కొనుగోలు చేయాలని మొహమ్మద్ బషీర్ అబ్దుల్ ఖాదీర్ ని కొనాలని వారు కోరారు....గంట వ్యవధిలో లాటరీ ఫలితాలలో విజేతని ప్రకటించేందుకు అన్ని టిక్కెట్లని బాగా కలిపి ఒక టికెట్ ని అందరి సమక్షంలో తీసి చూడగా 62 ఏండ్ల భారతీయ అదృష్టవంతుడు మొహమ్మద్ బషీర్ అబ్దుల్ ఖాదీర్ కె ఆ లాటరీ తగలడంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది....అక్షరాలా మరో 67 కోట్ల రూపాయలు ఆయనకు దక్కింది. ఈ అపురూప విజయం గురించి కథ ప్రపంచవ్యాప్తంగా వైరల్ గా మారింది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









