తమిళ చిత్రం.. 'విచారణ' పేరుతో తెలుగులో..
- August 25, 2016
'విశారణై' పేరుతో విడుదలై సంచలన విజయం సాధించడంతోపాటు.. 'ఉత్తమ ప్రాంతీయ చిత్రం'గా జాతీయ అవార్డు అందుకున్న తమిళ చిత్రం.. 'విచారణ' పేరుతో తెలుగులో విడుదల కానుంది. ది క్రైమ్ అన్నది ట్యాగ్ లైన్. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ సమర్పణలో.. కల్పనాచిత్ర పతాకంపై ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇంతకుముందు 'ఆదుకాలం'అనే చిత్రం రూపొందించి, ఆ చిత్రానికి కూడా జాతీయ అవార్డు అందుకున్న తమిళ సంచలనం వెట్రిమారన్ దర్శకత్వం వహించిన 'విచారణ' చిత్రం తమిళ్ వెర్షన్ కు ప్రముఖ హీరో ధనుష్ నిర్మాత కావడం విశేషం. ఓ ఆటో డ్రైవర్ జీవితంలో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ చిత్రం..రజినీ, కమల్ హాసన్ వంటి సూపర్ స్టార్స్ ప్రశంసలు అందుకుంది . ఇటీవలకాలంలో ఇంత గొప్ప చిత్రాన్ని తాము చూడలేదని పలువురు ప్రఖ్యాత దర్శకులు సైతం ఈ చిత్రంపై అభినందనల వర్షం కురిపించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన ఆనందిని అఛ్చ తెలుగు అమ్మాయి కావడం మరో ముఖ్య విశేషం. జి.వి.ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందించగా దినేష్, ఆనంది, కిషోర్, ఆదుకాలం మురుగదాస్, సముద్రఖని, అజయ్ ఘోష్ పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







