బహ్రెయిన్ తీవ్రవాద దాడిని ఖండించిన ముస్లిం వల్డ్ లీగ్

- July 30, 2015 , by Maagulf
బహ్రెయిన్ తీవ్రవాద దాడిని ఖండించిన ముస్లిం వల్డ్ లీగ్

బహ్రెయిన్  దేశం, సిట్రాలో ఇద్దరు పోలీసులను పొట్టనపెట్టుకుని, అనేకమందిని గాయాలపాలు చేసిన తీవ్రవాద దాడిని, మక్కాలోని ద ముస్లిం వల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ డా. అబ్దుల్లా బిన్ అబ్దుల్ మొహ్సిన్ అల్-తుర్కీ తీవ్రంగా ఖండించారు. ఆయన వెలువరించిన ఒక ప్రకటనలో, ప్రాంతీయ భద్రతను అల్లకల్లోలం చేసే లక్ష్యంతో సాగిన ఈ దాడిని ఖండిస్తూ, మరణించిన వారి కుటుంబాలకు సానుభూతిని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇటువంటి దాడులు ఇస్లాం కు మాత్రమేకాక మానవత్వానికి, అంతర్జాతీయ విలువలకు కూడా విఘాతమని చెబుతూ, దీనిని ఖండిచిన దేశాలు, అంతర్జాతీయ సంస్థలను ప్రశంసించారు.

 

--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com