బాంబే హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ..

- August 26, 2016 , by Maagulf
బాంబే హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ..

 బాంబే హైకోర్టు శుక్రవారం సంచలన తీర్పు ఇచ్చింది. ముంబైలోని ప్రసిద్ధ హాజీ అలీ దర్గాలో పవిత్ర స్థానం (సమాధి)వరకూ మహిళలను అనుమతించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు 2012లో దర్గా ట్రస్టు విధించిన నిషేధంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యం (పిల్‌)మీద ఆదేశాలిచ్చింది. 'భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్‌' (బీఎంఎంఏ) స్వచ్ఛంద సంస్థ తరఫున ఇద్దరు మహిళలు జకియా సోమన్‌, నూర్జహాన్‌ నియాజ్‌ ఈ పిల్‌ను దాఖలు చేశారు. బహిరంగ ప్రార్థన ప్రదేశంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకునే హక్కు దర్గా ట్రస్టుకు లేదని జస్టిస్‌ వి.ఎం.కానడే, జస్టిస్‌ రేవతి మోహితే దేరేల ధర్మాసనం పేర్కొంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com