చిరు,మహేష్ బాబు కలిసి చెన్నై వెళ్లనున్నారు
- July 30, 2015
విజయ్ హీరోగా శింబుదేవన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం 'పులి'. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ఈ చిత్రంలో విజయ్ కి జంటగా శృతి హాసన్, హన్సిక హీరోయిన్లుగా నటించగా, ఆలిండియా ఎవర్ గ్రీన్ స్టార్ శ్రీదేవి, కన్నడ స్టార్ సుదీప్ ప్రత్యేక పాత్రలు కనిపించనున్నారు. ఈ చిత్రం ఆడియోను ఆగస్ట్ 2న చెన్నయ్‌లో విడుదల చేయబోతున్నారు. తమిళ్లో ఇళయదళపతి గా పిలువబడే విజయ్‌కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే..దానికి తగ్గట్టుగానే ఆడియో ఫంక్షన్‌ని కూడా చాలా గ్రాండ్ చెయ్యాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేసారు. ఈ సందర్భంగా 'పులి' ఆడియో ఫంక్షన్‌కి హాజరు కావాల్సిందిగా టాలీవుడ్ నుండి మెగాస్టార్ చిరంజీవిని, సూపర్‌స్టార్ మహేష్ బాబు లను ముఖ్య అతిధులుగా రావాల్సిందిగా హీరో విజయ్ ఆహ్వానించారట. దీంతో ఆ ఇద్దరు కూడా ఆడియో ఫంక్షన్ కి వస్తామని మాట ఇచ్చారట. మెగాస్టార్ చిరంజీవి రావొచ్చు అని కోలీవుడ్ వర్గాలు చెపుతున్న, మహేష్ బాబు మాత్రం ఆడియో ఫంక్షన్ కి దూరంగా ఉంటాడు కాబట్టి మరి ఈ ఆడియో కి వస్తాడో రాడో అనేది కాస్త సందేహం లో ఉంది..
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







