మన్‌కీ బాత్ కార్యక్రమంలో మోదీ ...

- August 27, 2016 , by Maagulf
మన్‌కీ బాత్ కార్యక్రమంలో మోదీ ...

మన ఆడబిడ్డలే దేశానికి గర్వకారణమని, ప్రోత్సాహిస్తే ఎవరికీ తీసిపోమని రియో ఒలింపిక్స్‌లో నిరూపించారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఆదివారం జరిగిన మన్‌కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఒలింపిక్స్‌పై దేశంలో ఆసక్తి పెరుగుతోందని, సింధు, సాక్షి మాలిక్‌ పతకాలు గెలవడం సంతోషంగా ఉందన్నారు. ధ్యాన్‌చంద్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని, ధ్యాన్‌చంద్‌ సేవలను అందరూ మననం చేసుకోవాల్సి ఉందన్నారు. ధ్యాన్‌చంద్‌ దేశభక్తి, క్రీడాస్ఫూర్తి నిరుపమానం అన్నారు. జిమ్నాస్టిక్స్‌లో దీపాకర్మాకర్‌ తన ప్రతిభ ద్వారా అందరి మనసు దోచుకుందని, అలాగే గోపీచంద్‌ గొప్ప గురువు అని, గోపీచంద్‌కు అభినందనలు తెలుపుతున్నానన్నారు.

మోదీ యాప్‌ ద్వారా ఒలింపిక్స్‌పై ఎంతో మంది స్పందించారని, దేశ ప్రజలంతా క్రీడలపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని, క్రీడలు, క్రీడాకారులకు ప్రోత్సాహం అవసరం అన్నారు. 2020లో జరిగే ఒలింపిక్స్‌లో పతకాల సాధనకు ఇప్పటి నుంచే రోడ్‌మ్యాప్‌ సిద్ధం చేయాలని, ప్రపంచ క్రీడారంగంలోని నైపుణ్యాలను అధ్యయనం చేయాలన్నారు. అలాగే 2020, 2024, 2028 ఒలింపిక్స్‌కు దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించాలని, పర్యావరణానికి హాని చేయని వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com