ధోనీ అరుదైన రికార్డ్ సృష్టించాడు..
- August 28, 2016
మిడియా రధసారథి ధోనీ అరుదైన రికార్డ్ సృష్టించాడు. అనితర సాధ్యమైన విజయాలు నమోదు చేసిన ధోనీ జట్టు నాయకుడిగా ప్రపంచ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అమెరికాలో భారత్ ఆడిన తొలి క్రికెట్ మ్యాచ్‌తోనే అది సాధ్యమైంది. ఆ మ్యాచ్‌లో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కెప్టెన్‌గా ధోనీ రికార్డ్ నమోదు చేశాడు. శనివారం జరిగిన టీ20తో మొత్తం 325 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. దీంతో అన్ని ఫార్మాట్లలో కలిపి కెప్టెన్‌గా ధోనిదే ఉత్తమ రికార్డు. మహీ తర్వాత ఆసిస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 324 మ్యాచ్‌లకు సారథ్యం వహించి సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు.ఐసీసీ నిర్వహించే అన్ని ప్రపంచ స్థాయి టోర్నీల్లో కప్ అందుకున్న ఏకైక కెప్టెన్ కూడా ధోనీనే. వన్డే, టీ20 వరల్డ్ కప్‌లతో పాటు, ఛాంపియన్ ట్రోఫీలోనూ భారత్‌కు కప్ అందించాడు. 71 టీ20 మ్యాచ్‌లకు సారథ్యం వహించి ఈ ఫార్మాట్లో అత్యధిక మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన వికెట్ కీపర్‌గా కూడా రికార్డ్ నమోదు చేశాడు ధోనీ.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్‌గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్‌లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్‌లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్‌లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









