బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చిరంజీవి.. ..

- August 29, 2016 , by Maagulf
బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చిరంజీవి.. ..

రాజకీయాల్లోకి దిగి చాలామంది అభిమానులకు దూరమైన చిరంజీవి.. వాళ్లకి దగ్గరయ్యేలా మళ్లీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ఇందుకోసం బోయపాటితో రంగంలోకి దిగాలని ప్లాన్ వేసినట్టు టాక్. ప్రస్తుతం వీవీ వినాయక్‌తో 150వ సినిమా చేస్తున్నాడు ఆయన. ఈ ఫిల్మ్ తర్వాత బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో కొత్త మూవీకి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్టు సమాచారం. ఇందుకు గీతాఆర్ట్స్ బ్యానర్‌ను బేస్ చేసుకోవాలన్నది ఆలోచనగా ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి.'సరైనోడు'తో అల్లుఅర్జున్‌కి మాస్ ఇమేజ్‌ని తీసుకొచ్చాడు బోయపాటి. ఒకవిధంగా చెప్పాలంటే బన్నీ కెరీర్‌లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన ఫిల్మ్ కూడా ఇదే! అంతకుముందు 2014లో బాలయ్యతో 'లెజెండ్' చిత్రం చేశాడు.అదీకూడా బాక్సాఫీసు వద్ద హిట్ కొట్టిన విషయం తెల్సిందే! ఈ నేపథ్యంలో బోయపాటిని చిరు పిలవడం, మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన స్టోరీని రెడీ చేయాలని చెప్పడం అంతా జరిగిపోయిందని ఇన్‌సైడ్ న్యూస్.మరి బోయపాటి స్టోరీకి చిరు కనెక్ట్ అయితే ఈ డైరెక్టర్‌కి లక్కీ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఛాన్స్ ఇస్తే చిరంజీవితో ఫిల్మ్ చేయాలని చాలామంది డైరెక్టర్లు వెయిట్ చేస్తున్నారు. ఈలోగా బోయపాటి తెరపైకి రావడం విశేషం! ఒకప్పుడు నందమూరి హీరోలతో సినిమాలు చేసే బోయపాటి, క్రమంగా మెగాక్యాంప్‌కు దగ్గరవుతున్నట్లు కనిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com