కువైట్ లో వాహన యజమానులను హెచ్చరించిన ట్రాఫిక్ శాఖ..!!

- November 18, 2026 , by Maagulf
కువైట్ లో వాహన యజమానులను హెచ్చరించిన ట్రాఫిక్ శాఖ..!!

కువైట్: తమ వాహనాలను ఇతరులు నడిపేందుకు ఇచ్చే విషయంలో యజమానులు అప్రమత్తంగా ఉండాలని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Interior) హెచ్చరించింది. అనుమతి పొందిన డ్రైవర్లు తీవ్రమైన ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే, సంబంధిత వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని ఇంపౌండ్ చేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఇతరులకు వాహనం ఇచ్చే ముందు వారి డ్రైవింగ్ ప్రవర్తన, అర్హతలు, బాధ్యతాయుతంగా వాహనం నడిపే సామర్థ్యాన్ని పరిశీలించాలని ట్రాఫిక్ అవగాహన విభాగం అసిస్టెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా బు హసన్ సూచించారు.

వాహనం నడుపుతున్న సమయంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా సంబంధిత డ్రైవర్‌దే బాధ్యత అయినప్పటికీ, వాహనాన్ని అధికారులు స్వాధీనం చేసుకుంటే యజమానులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన వివరించారు. వాహనం ట్రాఫిక్ ఇంపౌండ్ కేంద్రంలో ఉన్నంతకాలం యజమానికి ఇబ్బందులు తప్పవని తెలిపారు. 

ముఖ్యంగా ప్రమాదానికి కారణమైన తర్వాత వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి పారిపోయే ఘటనలు వంటి తీవ్రమైన ఉల్లంఘనల్లో వాహన యజమానులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉందని హెచ్చరించారు.అందువల్ల కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా ఇతరులకు కారును ఇచ్చే ముందు వారి డ్రైవింగ్ అలవాట్లు, అర్హతలను తప్పనిసరిగా పరిశీలించాలని ట్రాఫిక్ శాఖ సూచించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com