ఈ నెల 3న ప్రారంభంకానున్న ప్రభుదేవా స్టూడియోస్
- July 31, 2015
ప్రభుదేవా స్టూడియోస్ చిత్ర నిర్మాణ రంగంలోకి ముమ్మరంగా అడుగుపెట్టనుంది. ప్రభుదేవా ఈ పేరు సినీ నృత్యానికి చిరునామాగా మారింది. ఆ తరువాత నటుడిగా, దర్శకుడిగా ప్రాచుర్యం పొందారు. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ కెళ్లి దర్శకుడిగా విజయఢంకా మోగించిన దర్శకుల్లో ఈయన ఒకరు. నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ఈ మూడు రంగాల్లోనూ సక్సెస్ అయిన ప్రభుదేవా తాజాగా నిర్మాతగా మారనున్నారు. ప్రభుదేవా స్టూడియోస్ బ్యానర్‌ను నెలకొల్పి తమిళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ చిత్రాలు నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ తమిళ చిత్ర పరిశ్రమలో టాలెంట్ కు కొదవలేదన్నారు. అలా కొత్తగా వస్తున్న యువ కళాకారుల్లోని ప్రతిభను వెలికితీసేలా చిన్నా, పెద్ద అన్న తారతమ్యం లేకుండా అంతర్జాతీయ స్థాయి చిత్రాలను నిర్మించాలన్నదే తన ధ్యేయం అన్నారు. అలాగే మంచి అనుభవం గల కళాకారులు, సాంకేతిక వర్గంతో క్వాలిటీ చిత్రాలు నిర్మిస్తానని తెలిపారు. మూడవ తేదీన అధికారిక పూర్వకంగా ప్రభుదేవా స్టూడియోస్ బ్యానర్‌ను ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. వివరాలను వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!







