జపాన్ ఉత్తర తీర ప్రాంతం లో టైఫూన్ బీభత్సం
- August 31, 2016
జపాన్ ఉత్తర తీర ప్రాంతాన్ని లయన్‌రాక్ టైఫూన్ తాకడంతో భారీ వర్షాలు ముంచెత్తాయి. ఇవాతే ప్రిఫెక్చర్‌లోని ఇవైజుమి నగరంలో భారీ వర్షాలకు ఆసుపత్రి నీటమునిగింది. ఈ భవనం నుంచి బుధవారం ఉదయం తొమ్మిది మృతదేహాలు వెలికితీసినట్లు పోలీసులు వెల్లడించారు. వర్షాలధాటికి నర్సింగ్ హోంలో కొంతభాగం మట్టిలో కూరుకుపోయింది. ఆ ప్రాంతంలో నీరు పెద్ద మొత్తంలో నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల వాహనాలు తలకిందులయ్యాయి.
ఈ టైఫూన్ కారణంగా జపాన్ ఉత్తర ప్రాంతంలోని రెండు నదులు ప్రమాదకరస్థాయికి మించి ప్రవహించడంతో పెద్ద ఎత్తున వచ్చిన వరద నీరుతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి.
సహాయ సిబ్బంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. లైన్స్ ధ్వంసమవ్వడంతో దాదాపు 10వేల గృహాలకు కరెంట్ నిలిచిపోయింది. దాదాపు 1,70,000 మందిని పునరావాస శిబిరాలకు తరలించారు. మంగళవారం సాయంత్రం నుంచి మినామి-ఫురానో, హొక్కైదో, హోన్షు తదితర ప్రాంతాలు టైఫూన్‌కు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









