తమిళంలో విడుదల కానున్న జాకీ చాన్ సినిమా
- August 31, 2016
జాకీజాన్ కథానాయకుడిగా ఇటీవల విడుదలైన చిత్రం 'స్కిప్ ట్రేస్'. చైనాలో మాత్రమే విడుదలైన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. విడుదలైన తొలిరోజే ఏకంగా రూ.420 కోట్ల కలెక్షన్ రాబట్టింది. వారం రోజుల్లో దాదాపు రూ.1000 కోట్ల వరకు కలెక్షన్ వచ్చినట్లు సంబంధిత వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. పక్కా కమర్షియల్ హంగులతో రూపొందించిన ఈ సినిమాను ప్రస్తుతం తమిళంలో 'ఇరు కిలాడిగల్' పేరుతో అనువాదం చేశారు. 100కు పైగా ఆంగ్ల చిత్రాలను విడుదల చేసిన సన్‌మూన్ పిక్చర్స్ బ్యానరుపై విశ్వాస్ సుందర్ ఈ చిత్రాన్ని తమిళంలో విడుదల చేస్తున్నారు.
సెప్టెంబరు రెండో తేదీన 'ఇరు కిలాడిగల్' చిత్రం తెరపైకి రానుంది. ఈ సినిమాను సూపర్‌స్టార్ రజనీకాంత్ వీక్షించనున్నట్లు సమాచారం.
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









