వాంటెడ్ లిస్ట్‌లో 70 ఏళ్ళ మహిళ!
- September 01, 2016
కింగ్ ఫహాద్ కాజ్వే పోలీసులు 70 ఏళ్ళ మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఆమె బహ్రెయిన్‌కి వెళుతుండగా పోలీసులు ఆమెను అడ్డగించడం జరిగింది. ఆ సమయంలో ఆమెతోపాటు ఆమె కుమారుడు కూడా ఉన్నాడు. హైల్ సిటీలో ఆమె ఫైనాన్షియల్ కేసులకు సంబంధించి వాంటెడ్‌గా ఉన్నారు. అయితే, ఈ సందర్బంగా ఆమె తనయుడు, తమపై ఎలాంటి కేసులు లేవని పోలీసులకు తెలిపాడు. కానీ పోలీసులు దమ్మమ్ పోలీసులకు వారిని రిఫర్ చేశారు. అక్కడి నుంచి వారిని హైల్కి తరలించారు. ఈ సందర్భంగా ఆ వృద్ధురాలు తీవ్ర మనోవేదనతో కుప్పకూలిపోయారు. పోలీసులు తన సోదరుడు ప్రిజనర్ని స్మగ్లింగ్ చేసినట్లు ఆరోపించారనీ, ఇది తమకు చాలా ఇబ్బంది కలిగించిందని ఆవేదన చెందాడు ఆమె తనయుడు. ఇంకో వైపున, హైల్ ఎగ్జిక్యూషన్ కోర్ట్‌లో ఓ ఉద్యోగి చేసిన పొరపాటు వల్లనే ఇదంతా జరిగిందని అధికారులు గుర్తించారు. ఆ వృద్ధురాల్ని అనంతరం విడుదల చేశారు. అయితే తమకు కలిగిన మనోవేదన నేపథ్యంలో కోర్టును ఆశ్రయిస్తామని బాధిత కుటుంబం చెబుతోంది.
తాజా వార్తలు
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత









