కేరళకు 'గల్ఫ్' కష్టాలు
- September 01, 2016
కేరళకు గల్ఫ్ కష్టాలు వచ్చాయి. సౌదీ అరేబియా వంటి గల్ఫ్ దేశాలు అమలు చేస్తున్న చర్యల వల్ల అక్కడ పని చేస్తున్న భారతీయులు ఉపాధి కోల్పోతున్నారు. వీరిలో కేరళ నుంచి వెళ్ళినవారు ఎక్కువగా ఉన్నారు. వీరు తమ ఇళ్ళకు పంపిచే సొమ్ము తగ్గిపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మాంద్యంలోకి పోతోందని 100 రోజుల క్రితం ఏర్పాటైన వామపక్ష ప్రభుత్వం చెప్తోంది. కేరళ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ మాట్లాడుతూ చమురు ధరలు తగ్గిపోతుండటంతో సౌదీ అరేబియా వంటి దేశాలు పొదుపు చర్యలను ప్రారంభించడంతో భారతీయులు ఉద్యోగాలు కోల్పోతున్నారని, వారిలో కేరళీయులు ఎక్కువ అని తెలిపారు. వారు రాష్ట్రంలోని తమ కుటుంబాలకు పంపించే సొమ్ము తగ్గిపోతోందని, దీంతో కేరళ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు.
మూడు దశాబ్దాల్లో తొలిసారిగా 2015-16 ఆర్థిక సంవత్సరంలో కేరళ వృద్ధి రేటు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉందని, ప్రాంతీయ ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోందని చెప్పారు. రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలకు గల్ఫ్ నుంచి వచ్చే సొమ్ము ఆధారమని తెలిపారు. ఈ సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొనేందుకు బడ్జెట్‌లో సాహసోపేత చర్యలను ప్రతిపాదించామన్నారు. కేరళ ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరిచేందుకు రూ.20 వేల కోట్లతో పెట్టుబడుల ప్యాకేజీని ప్రకటించినట్లు తెలిపారు.కేరళలో వృద్ధి వేగం పుంజుకోవడానికి ఇది దోహదపడుతుందని ఆశిస్తున్నామన్నారు.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







