అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటక శాఖ బ్రాండ్‌ అంబాసిడర్‌గా జాన్‌ అబ్రహం

- September 04, 2016 , by Maagulf
అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటక శాఖ బ్రాండ్‌ అంబాసిడర్‌గా జాన్‌ అబ్రహం

అరుణాచల్‌ ప్రదేశ్‌ పర్యటక శాఖ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఆ రాష్ట్ర ప్రభుత్వం బాలీవుడ్‌ నటుడు జాన్‌ అబ్రహంని ఎంపికచేసింది. ఇటీవల టూరిజం ప్రచారం కోసం అరుణాచల్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం వయాకాం 18 సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న ఇప్పుడు చక్కటి ఫిట్‌నెస్‌, బైక్‌రైడింగ్‌, స్పోర్ట్స్‌లో ప్రావిణ్యం ఉన్న జాన్‌ అబ్రహం టూరిజంకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా సరిపోతాడని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అరుణాచల్‌ ప్రదేశ్‌ సంస్కృతి సంప్రదాయం, ఇక్కడి సంగీతం చాలా ఆసక్తికరంగా ఉంటాయని వీటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఉండడానికి జాన్‌ అంగీకరించినట్టు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com