13 మంది భారతీయులు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరారు
- August 03, 2015
గడిచిన ఏడాదిన్నర కాలంలో 13 మంది భారతీయులు విదేశాలకు వెళ్లి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరారు. వాళ్లలో ఇప్పటికి ఆరుగురు మరణించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం బతికున్నవాళ్లలో ఒక్కరు మాత్రమే పోరాటంలో ఉన్నారని, మిగలినవాళ్లు వంటవాళ్లు గాను, డ్రైవర్లు గాను, హెల్పర్లు గాను పనిచేస్తున్నారని హోం మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. మహారాష్ట్రలోని కళ్యాణ్ ప్రాంతానికి చెందిన నలుగురు యువకుల బృందంలోని ఇద్దరు గత మే నెలలో దేశాన్ని వదిలి వెళ్లి ఇస్లామిక్ స్టేట్ లో చేరారు. మరో ముగ్గురు ఆస్ట్రేలియా, ఒమన్, సింగపూర్ దేశాల నుంచి అక్కడకు వెళ్లారు. వీళ్లంతా ప్రస్తుతం అక్కడ ఉన్నట్లు చెబుతున్నారు. పెరుగుతున్న ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద ముప్పుపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం 10 రాష్ట్రాల అధికారులతో ఓ ఉన్నతస్థాయి సమావేశాన్ని త్వరలో నిర్వహించనుంది.
తాజా వార్తలు
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం







