చాలా మంది ప్రాణాలు కాపాడిన.. పాల వ్యాపారి.!

- August 03, 2015 , by Maagulf
చాలా మంది ప్రాణాలు కాపాడిన.. పాల వ్యాపారి.!

ఉదయాన్నే కోడికూతతో నిద్రలేవడం.ఇంటింటికి వెళ్ళి పాలు సేకరించడం.వాటిని అమ్మడం అదే అతని జీవనాధారం.ఇప్పుడు ఇతను 250 మందికి పునర్జీవితాన్నిఇచ్చిన దేవుడే.అవును ఆ 250 మంది వారి జీవితంలో ప్రతి ఒక్కసారి ఇతనిని తల్చుకోవాల్సిందే.. వారు అనుభవిపస్తున్న ప్రతి క్షణం ఇతను ప్రసాదించిందే..పాల వ్యాపారి, 250 మందికి దేవుడవ్వడం ఏంటి అనుకుంటున్నారా? అయితే స్టోరీని పంజాబ్ కు తీసుకెళ్లాల్సిందే. నాలుగు రోజుల క్రితం పంజాబ్ టెర్రరిస్ట్ లకు పోలీసులకు జరిగిన భీకర ఎన్ కౌంటర్ గురించి తెలుసు కదా.? ఆ ఎన్ కౌంటర్ లో ఉగ్రవాదులను మన పోలీసులు ప్రాణాలకు తెగించి మరీ తుదముట్టించిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు ఉగ్రవాదులు. రైల్వే ట్రాక్ పై బ్లాస్టింగ్ కు అమర్చిన బాంబులను పేలకముందే.. గుర్తించారు పోలీసులు. ఆ బాంబులను మొదట గుర్తించింది ఆ పాల వ్యాపారే ఆయన పేరే సత్పాల్.. ఆ రోజు ఆయన తీసుకున్న తెలివైన నిర్ణయం కారణంగానే 250 మంది సజీవంగా బయటపడగలిగారు. రోజువారీగానే తన బిజినెస్ లో భాగంగా పాలను సేకరించాడానికి రైల్వే బ్రిడ్జ్ కు అవతల వైపు ఉన్న ఇంటికి ట్రాక్ దాటి వెళుతున్న అతను.. ట్రాక్ పై ఉన్న వైర్లను గమనించాడు. ఆ వైర్లు అయిదు బాక్సులకు జాయింట్ చేయడాన్ని గమనించి అనుమానంతో వెంటనే తనకు తోడుగా ఉన్న బాలుడిని.గ్యాంగ్ మ్యాన్ దగ్గర కు పంపించి సమాచారం అందించాడు. దాంతో వెంటనే అలర్ట్ అయిన గ్యాంగ్ మాన్.. అప్పుడే అటువైపుకు 250 మంది ప్రయాణికులతో వస్తున్న ట్రైన్ ఆపేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది.ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన సత్పాల్ కు, గ్యాంగ్ మాన్ కు ఆర్మీ ఆఫీసర్లు ఈ రోజు సత్కారం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com