సెప్టెంబరు 18న విడుదల కానున్న 'జాగ్వార్' ఆడియో
- September 05, 2016
మాజీ ప్రధాని దేవెగౌడ్ మనవడు నిఖిల్ కుమార్ను హీరోగా పరిచయం చేస్తూ రూ. 75 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిస్తున్న 'జాగ్వార్' చిత్రం ఆడియోను ఈ నెల 18న విడుదల చేయనున్నారు. చిత్ర బృందం ఓ ప్రకటన ద్వారా ఈ విషయాన్ని తెలుపుతూ.. పోస్టర్లను విడుదల చేసింది. ఎ. మహదేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి అనితా కుమారస్వామి నిర్మాతగా వ్యవహరిస్తుండగా హెచ్.డి. కుమారస్వామి సమర్పిస్తున్నారు. థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్, రమ్యకృష్ణ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా హెచ్.డి. కుమారస్వామి మాట్లాడుతూ.. 'ఈ చిత్రం తాజా షెడ్యూల్ హైదరాబాద్లో జరుగుతోంది. చిత్ర పరిశ్రమలోని టాప్ టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
తమన్నా ప్రత్యేక గీతం సినిమాకి హైలైట్ కానుంది. ఈ చిత్రం ఆడియోను సెప్టెంబరు 18న సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో విడుదల చేయబోతున్నాం. దసరా కానుకగా అక్టోబరు 6న సినిమాను విడుదల చేయబోతున్నాం' అన్నారు.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







