మొజావె ఎడారిలో ఓ స్విమ్మింగ్ పూల్ !
- September 05, 2016
ఎడారిలో గుక్కెడు నీళ్లు దొరకడమే కష్టం. అలాంటిది ఓ స్విమ్మింగ్ పూల్ కనిపిస్తే ఎలా ఉంటుంది! ఆ ఆనందానికి అవధులుండవు కదూ! వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా.. అమెరికాలోని కాలిఫోర్నియా సమీపంలోని మొజావె ఎడారిలో ఓ స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేశారు. అయితే.. ఇందులో స్నానం చేయాలంటే మాత్రం నిర్వహకులు పెట్టే వింత పరీక్షలో నెగ్గాల్సిందేనట.అల్ఫ్రెడో బర్సుగ్లియా అనే ఆస్ట్రియన్ ఆర్టిస్ట్ ఈ సోషల్పూల్(స్విమ్మింగ్‌పూల్)ను 2014లో రూపొందించాడు. 11 అడుగుల పొడవు 5 అడుగుల వెడల్పులో చల్లని.. శుభ్రమైన నీటితో దీన్ని ఏర్పాటు చేశాడు. మొజావె ఎడారిలో ఏర్పాటుచేసిన ఈ సోషల్పూల్కి వెళ్లి ఎవరైనా సంతోషంగా గడపవచ్చు.అయితే.. ముందుగా వెస్ట్ హాలీవుడ్‌లోని మ్యాక్ సెంటర్ ఫర్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కార్యాలయానికి వెళ్లి ఆ సోషల్పూల్కు సంబంధించిన తాళం.. జీపీఎస్ పరికరాలను తీసుకోవాలి. తర్వాత..ఎడారిలో అది ఎక్కడ ఉందో కనిపెట్టాలి. అప్పుడే.. అందులో స్నానం చేసే అవకాశం లభిస్తుందట. అయితే..వెతికేందుకు జీపీఎస్ పరికరాన్ని ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించారు. దీన్ని వెతికేందుకు 24 గంటల సమయం మాత్రమే ఇచ్చారు. ఆ సమయంలోనే వెతికి పట్టుకుని స్నానం చేయాలని షరతు విధించడం విశేషం
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







