16న విడుదల కానున్న 'అత్తారిల్లు'

- September 06, 2016 , by Maagulf
16న  విడుదల కానున్న 'అత్తారిల్లు'

అంజన్‌ కె. కళ్యాణ్‌ ఆర్ట్‌ క్రియేషన్స్‌ బ్యానర్‌పై అంజన్‌ కె. కళ్యాణ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'అత్తారిల్లు'. కొత్త నటీనటులతో రూపొందిన ఈ హర్రర్‌ కామెడీ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 16న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా అంజన్‌ కె. కళ్యాణ్‌ మాట్లాడుతూ.. 'ఇటీవల విడుదలైన మా 'అత్తారిల్లు' పాటలు శ్రోతలను అలరిస్తున్నాయి. ట్రైలర్‌కి కూడా మంచి స్పందన వచ్చింది. ఇందులో కడుపుబ్బ నవ్వించే కామెడీ, భయపెట్టించే థ్రిల్స్‌తోపాటు ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్నీ ఉన్నాయి. కథ, కథానాలు కొత్తగా ఉంటాయి' అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com