పారా ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలు..

- September 07, 2016 , by Maagulf
పారా ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలు..

మరికొద్దిగంటల్లో రియో డిజనీరోలోని మారకానా స్టేడియంలో పారా ఒలింపిక్స్‌ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. వికలాంగులకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న రియో 2016 పారా ఒలింపిక్స్‌ పోటీలను ఈ సారి ప్రపంచవ్యాప్తంగా రికార్డుస్థాయిలో 154 దేశాల్లో ప్రసారం చేస్తున్నట్లు ఇంటర్నేషనల్‌ పారాలింపిక్‌ కమిటీ వెల్లడించింది. టీవీ, రేడియో, ఆన్‌లైన్‌ ద్వారా పోటీలను ప్రత్యక్షంగా వీక్షించవచ్చని కమిటీ సిబ్బంది తెలిపారు.2012 లండన్‌ పారాలింపిక్‌ గేమ్స్‌ను 115దేశాల్లో ప్రసారం చేయగా ఈసారి 30శాతంపైగా పెంచినట్లు తెలిపారు. 2012లో 3.8బిలియన్ల మంది ఈ ప్రసారాలను వీక్షించగా..ఈ సారి వారి సంఖ్య 4బిలియన్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. పారాలింపిక్స్‌ ఈ నెల 7 నుంచి 18 వరకు జరగనున్నాయి. మన దేశం తరఫున 15మంది ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com