ఒమన్‌లో ఉచిత కన్సల్టేషన్తో కొత్త హాస్పిటల్
- September 08, 2016
మస్కట్: ఒమన్‌లో కొత్తగా ఏర్పాటయిన ఆసుపత్రిలో ఉచిత కన్సల్టేషన్ రోగులకు లభించనుంది. ఆసుపత్రి కార్యకలాపాలు ప్రారంభమైన తరువాత నెల రోజులపాటు ఈ ఉచిత కన్సల్టేషన్ ఆఫర్ అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రతినిథులు వెల్లడించారు. షిఫా అల్ జజీరా మెడికల్ గ్రూప్, తన తొలి ప్రీమియమ్ పోలీ క్లినిక్‌ని అల్ కువైర్లో సెప్టెంబర్ 29న ప్రారంభం కానుంది. ఉచిత కన్సల్టేషన్, ట్రీట్మెంట్తో అక్టోబర్ 29 వరకు రోగులకు సేవలు అందిస్తుంది. హాస్పిటల్లో 24 మంది స్పెషలిస్టులు సేవలు అందించనున్నారని చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కెటి రుబీయుల్లా చెప్పారు. అలాగే తమ గ్రూపు జిసిసిలోని ప్రముఖ ఆసుపత్రులతోనూ, ఇండియాలోని పలు ఆసుపత్రులతోనూ 'టై అప్' పెట్టుకోనుందని వివరించారు. కేరళలోని కోజికోడ్‌లో గల బేబీ మెమోరియల్ హాస్పిటల్ (బిఎమ్హెచ్)తో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారు. బిఎమ్హెచ్ 800 పడకలతో 40 మెడికల్ సర్జికల్ డిపార్ట్‌మెంట్స్‌ని కలగి ఉందని బిఎంహెచ్ ఛైర్మన్ డాక్టర్ కెజి అలెగ్జాండర్ తెలిపారు. వైద్య చికిత్స కోసం ఇండియాలోని కేరళకువ ఎళ్ళే వారి కోసం మస్కట్‌లో స్పెషల్ డెస్క్‌ని ఏర్పాటు చేయనున్నట్లు డాక్టర్ రుబీయుల్లా చెప్పారు.
తాజా వార్తలు
- ఖతార్ పై మిస్సైల్ అటాక్.. అడ్డుకున్న డిఫెన్స్ సిస్టమ్..!!
- బహ్రెయిన్ లో డ్రోన్ దాడి.. పలువురికి గాయాలు..!!
- ధరల పెంపు..449 సంస్థలకు Dh176,000 ఫైన్స్..!!
- డ్రోన్‌ను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం
- సౌదీ అరేబియాలో క్షిపణి పడి ఇద్దరు మృతి, 12 మందికి గాయాలు









