ద్రాక్షతో మతిమరుపు మాయం
- August 04, 2015
ద్రాక్ష పండు ముఖ్యంగా రెండు రకాల్లో లభిస్తుంది. తెల్ల ద్రాక్ష, నల్లద్రాక్ష. నల్లద్రాక్షతో పోలిస్తే తెల్ల ద్రాక్ష తియ్యగా ఉంటుంది. దీనికి కారణం తెల్ల ద్రాక్షలో గ్లూకోజ్ ఉంటుంది. ఏ ద్రాక్ష తిన్నా అది మన శరీరానిక చాలా ఆరోగ్యాన్నిస్తుంది. ద్రాక్షలో సి విటమిన్‌తో పాటూ విటమిన్ ఎ, బి6, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, కాల్షియం, ఐరన్, పాస్ఫరస్, సెలీనియంలాంటి ఎన్నో రకాల ఖనిజలవణాలు సమృద్ధిగా ఉంటాయి. పరగడుపున ఒక గ్లాసుడు ద్రాక్ష రసం తీసుకోవడం వల్ల మైగ్రేన్ తలనొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు, నల్ల ద్రాక్షలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండెను కాపాడతాయి. ప్రతిరోజూ ద్రాక్ష రసం తీసుకోవడం అనే అలవాటు చేసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ద్రాక్షలో ఉండే రిస్ అనే పాలీ ఫినాల్ మతిమరుపు రాకుండా చేసి మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది. ద్రాక్షలోన యాంటీ ఆక్సిడెంట్లు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించి, వైరల్ జ్వరాలు రాకుండా చేస్తాయి. దంత సంబంధ వ్యాధులను అరికట్టడంలో కూడా ద్రాక్ష ముఖ్య పాత్ర పోషిస్తుంది.
తాజా వార్తలు
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్







