మధ్యప్రదేశ్ లో ఘోర రైళ్లు ప్రమాదాలు

- August 04, 2015 , by Maagulf
మధ్యప్రదేశ్ లో ఘోర రైళ్లు ప్రమాదాలు

మధ్యప్రదేశ్ :రాష్ట్రంలో రెండు ఘోర రైళ్లు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ముంబై నుండి వారణాసి వెళుతున్న కామయాని ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి 10 బోగీలు మాచాక్ నదిలో పడిపోయాయి. నదిలో పడిపోయిన సుమారు 300 మంది ప్రయాణీకులను స్థానికులు కాపాడారు. ఖిర్కియా - భిరంగి రైల్వే స్టేషన్ మధ్య రాత్రి 11.45 సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పాట్నా - ముంబాయి మధ్య జనతా ఎక్స్ ప్రెస్ సమాచార లోపం కారణంగా కొన్ని నిమిషాల్లోనే అక్కడకు చేరుకుని పట్టాలు తప్పింది. దీనిలో ఇంజిన్ తో సహా ఐదు బోగీలు నదిలో పడిపోయాయి. కామయాని ఎక్స్ ప్రెస్ ముంబై నుండి వారణాసి వెళుతోంది. జనతా ఎక్స్ ప్రెస్ జబల్ పూర్ నుండి ముంబై వెళుతోంది.
పట్టాలపై భారీ నీరు..
పట్టాలపై భారీగా నిలిచిన నీరే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదాల్లో ఇప్పటి వరకు 10 మంది మృతదేహాలను బయటకు తీశారు. భారీ సంఖ్యలో పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య భారీగానే ఉంటుందని తెలుస్తోంది. దీనితో సహాయక చర్యలకు మరో మూడు రైళ్లలో సిబ్బంది, వైద్యులు ప్రమాదస్థలికి బయలుదేరారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిబ్బందిని ఘటనాస్థలికి తరలించి సహాయక చర్యలు చేపట్టింది. ఈ ప్రమాద ఘటనపై విచారణకు రైల్వే శాఖ ఆదేశించింది.
సహాయక చర్యలు చేపడుతున్నాం..
మాచక్ నదిలో బోగీలు పడిపోయిన ఘటనపై కేంద్ర మంత్రి సురేష్ ప్రభు స్పందించారు. చీకటి, భారీ వర్షాలతో సహాయ చర్యలకు ఆటంకాలు తలెత్తుతున్నాయన్నారు. సమాచారం తెలుసుకున్న వెంటనే ఆయన ఘటనాస్థలికి బయలుదేరారు. వెంటనే ప్రమాదస్థలికి వెళ్లాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
మధ్యప్రదేశ్ లో ప్రమాదాల దృష్ట్యా పలు రైళ్లు నిలిపివేత..
రాష్ట్రంలో చోటు చేసుకున్న ప్రమాదాల దృష్ట్యా పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు. ముంబై, ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, పంజాబ్ వెళ్లాల్సిన పలు రైళ్లు నిలిపివేశారు. మరికొన్ని రైళ్లను రాజస్థాన్ - కోటా మీదుగా దారి మళ్లించారు. 

 

--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com