పారాలింపిక్స్‌లో పతక విజేతలకు మోదీ అభినందనలు..
- September 10, 2016
రియో డి జనీరోలో జరుగుతున్న పారాలింపిక్స్‌లో స్వర్ణం, కాంస్య పతకాలను సాధించిన అథ్లెట్లకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. భారత్ సంతోషంతో ఉప్పొంగిపోతోందన్నారు. స్వర్ణ పతకం సాధించిన మరియప్పన్ తంగవేలు, కాంస్యం సాధించిన వరుణ్ సింగ్‌కు మోదీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు. మోదీతో పాటు అభినవ్ బింద్రా, విజయ్‌గోయల్, బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పలువురు వారిని అభినందించారు.
* వారిద్దరి ఘనతను అభినందిస్తూ.. తంగవేలును స్వర్ణ పతక క్లబ్‌లో స్వాగతిస్తున్నాం- అభినవ్ బింద్రా
* రియో హైజంప్ విభాగంలో స్వర్ణం, కాంస్యం సాధించిన మరియప్పన్, వరుణ్ సింగ్‌కు కంగ్రాట్స్.
చరిత్రాత్మక విజయం.. మన అథ్లెట్లను చూసి ఎంతో గర్వంగా భావిస్తున్నా- క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్
* వీరిద్దరూ ఎంతో మంది అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలిచారు. ఇద్దరికీ అభినందనలు- రియో కాంస్య పతక విజేత సాక్షి మాలిక్
* 'కమాన్ ఇండియా'.. హైజంప్ విభాగంలో స్వర్ణం, కాంస్యం సాధించిన తంగవేలు, భాటికి అభినందనలు.- అమితాబ్ బచ్చన్
* రియో ఒలింపిక్ పతక విజేతలు పీవీ సింధు, సాక్షిలను గౌరవించినట్లు వీరిద్దరినీ భారత్ గౌరవిస్తుంది. వారికి ఇచ్చినట్లే ప్రైజ్ మనీని పారాలింపిక్ అథ్లెట్లకు ఇవ్వాలని ఆశిస్తున్నాను- బాక్సర్ విజేందర్ సింగ్
* మరియప్పన్, వరుణ్ సింగ్‌లకు అభినందనలు- కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







