దేశ రాజధాని మెట్రో ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం
- September 10, 2016
దేశ రాజధాని దిల్లీ నగరంలో మెట్రో ఛార్జీలు భారీగా పెరిగే అవకాశం ఉంది. దిల్లీ మెట్రో రైలు ఛార్జీలను 66శాతం పెంచాలని ప్యానెల్ నివేదికలో సిఫార్సు చేసింది. ఇలా జరిగితే ప్రయాణికులపై ఛార్జీల భారం విపరీతంగా పెరుగుతుంది. ప్యానెల్ సిఫార్సుల ప్రకారం తక్కువ స్థాయిలో ఉన్న ఛార్జీలు పెరగనున్నాయి. టిక్కెట్ ధర ప్రస్తుతం ఉన్న రూ.8 నుంచి రూ.10కి, రూ.30 నుంచి రూ.50కి పెరగొచ్చు. ఛార్జీల నిర్ణయ కమిటీ ఈ మేరకు సిఫార్సులు చేస్తూ నివేదిక పంపించినట్లు అధికారిక వర్గాల నుంచి సమాచారం.
కమిటీ సిఫార్సులపై దిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్(డీఎంఆర్సీ) అధికారులు, పట్టణాభివృద్ధి విభాగం సెక్రటరీ మెట్రో ఛార్జీలపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
డీఎంఆర్సీ చివరగా 2009లో ఛార్జీలను రివైజ్ చేసింది. ఈ ఏడాది జూన్‌లో ఛార్జీల మార్పు కోసం దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎంఎల్ మెహతా ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ మూడు నెలల పరిశీలన అనంతరం తాజాగా 66శాతం ఛార్జీలు పెంచాలని నివేదిక ఇచ్చింది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో ఘనంగా శతావధాన కార్యక్రమం
- విద్యార్థుల కోసం పార్ట్నర్ షిప్ సమ్మిట్: సీఎం చంద్రబాబు
- భారత్‌లో 2.5 లక్షల టాటా ఎలక్ట్రిక్ కార్లు
- ఫ్లెమింగో రెస్టారెంట్ తాత్కాలికంగా మూసివేత..!!
- సౌదీలో తగ్గిన బ్యాంకింగ్, పేమెంట్ సేవా రుసుములు..!!
- యూఎస్ కాన్సులేట్ 3 రోజులపాటు మూసివేత..!!
- లైసెన్స్ లేకుండా అడ్వర్టైజ్.. KD 500 జరిమానా..!!
- బహ్రెయిన్‌లో TRA శాటిలైట్ డైరెక్ట్-టు-డివైస్ సేవలు..!!
- ఒమాన్-సౌదీ ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం..!!
- మిషన్ భద్రత పై భారత రాయబారికి బంగ్లాదేశ్ సమన్లు







