మన ఊరి రామాయణం థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల

- September 16, 2016 , by Maagulf
మన ఊరి రామాయణం థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల

విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం మన ఊరి రామాయణం. ప్రకాశ్‌రాజ్ సొంత నిర్మాణ సంస్థలో వస్తున్న ఈ మూవీ ఆడియో వేడుకని గ్రాండ్ గా నిర్వహించారు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందించగా నిన్న జరిగిన ఆడియో వేడుకకు గెస్ట్ గా అక్కినేని నాగార్జున, బోయపాటి శ్రీనులు హాజరయ్యారు. ప్రస్తుతం ఇళయరాజా పలు కార్యక్రమాలతో యూఎస్‌లో బిజీబిజీగా ఉన్న నేపథ్యంలో ఈ పాటలపండుగకి హాజరు కాలేకపోయినట్టు తెలుస్తోంది. ప్రియమణి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రం ఆడియో సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తుంది. తాజాగా చిత్రానికి సంబంధించి థియేట్రికల్ ట్రైలర్ ని విడుదల చేశారు.దసరా కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com